calender_icon.png 25 January, 2026 | 12:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికల్లో పద్మశాలీలకు ప్రాతినిధ్యం కల్పించాలి

25-01-2026 11:29:14 AM

హుజూర్ నగర్: మున్సిపల్ ఎన్నికల్లో పద్మశాలీలకు ప్రాతినిధ్యం కల్పించాలని హుజూర్ నగర్ పట్టణ పద్మశాలి అధ్యక్షుడు బొడ్డు గోవిందరావు అన్నారు. శనివారం పట్టణ పద్మశాలి సంఘ భవనంలో సమావేశం నిర్వహించి పలువురు మాట్లాడుతూ... రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పద్మశాలీలకు  ప్రాతినిధ్యం కల్పిస్తూ రెండు వార్డుల్లో కౌన్సిలర్లుగా పోటీ చేయుటకు అవకాశం కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి ప్రధాన కార్యదర్శి గంజి శివ, కోశాధికారి నామని చంద్రశేఖర్, గౌరవ అధ్యక్షులు దికొండ లక్ష్మీనారాయణ భవన నిర్మాణ కమిటీ అధ్యక్షులు నామని కుమారస్వామి, శ్రీరామ్ వెంకన్న, జల్లా సత్తయ్య,కలకుంట్ల సైదులు, తదితరులు,పాల్గొన్నారు.