calender_icon.png 25 January, 2026 | 1:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాన పహాడ్ దర్గా సర్వమత సమ్మేళ్ళానికి ప్రతీక

25-01-2026 11:32:31 AM

పాలకీడు: మత సామరస్యానికి ఐక్యతగా నిలిచిన జానపహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలు గురు, శుక్ర, శని మూడు రోజుల పాటు వాక్ఫ్ బోర్డు ముజవర్ జానీ అధికారులు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఉర్సు వేడుకలకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రల నుంచి లక్షలాదిగా భక్తులు పాల్గొన్నారు. చివరి రోజు ఉర్సు ముగింపు కావడంతో 20 వేల మంది భక్తులు పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు శనివారం చీకటిపడే సమయానికి ముజవర్ జానీ దీపారాధన చేయడంతో ఉర్సు వేడుకలు ముగిసినాయి,

దర్గాను దర్శించుకున్న మంత్రి అజారుద్దీన్..

 పాలకవీడు మండలం జాన పహాడ్ దర్గాను మంత్రి శనివారం దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం ఉర్స్ ఉర్సు ఉత్సవం లో భాగంగా, శనివారం ఆయన జియారత్ దర్శనం కోసం వచ్చానని ఇక్కడ ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి అన్ని వర్గాల ప్రజలు వస్తారని హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవ, అందరూ ఇక్కడికి వచ్చి తమ మొక్కులు తీర్చుకుని వెళ్తుంటారని తెలిపారు.​

మీ అందరి మధ్యకు రావడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని అల్లా దయవల్ల అవకాశం దొరికితే మళ్ళీ వస్తానని, నేను కోరుకునేది ఒక్కటేనని మీరందరూ ఇక్కడ కలిసిమెలిసి ఉండాలని మంచి పనులు చేయాలని అన్ని వర్గాలు కలిసి ఉంటేనే పని బాగా జరుగుతుందని ​ఇక్కడికి బయటి నుంచి కూడా చాలా మంది వస్తుంటారని ఇది చాలా పెద్ద దర్గా షరీఫ్, ఇక్కడ గొప్ప మహనీయులు (బుజుర్గాన్-ఏ-దీన్) కొలువై ఉన్నారు.

​చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ నా శుభాకాంక్షలు తెలిపినారు. ఈ ఉర్స్ ప్రతి ఏటా చాలా బాగా జరుగుతుంది, ఇన్షా అల్లాహ్ వచ్చే ఏడాది కూడా ఇంకా బాగా జరుగుతుందని ఆశిస్తున్నానని అన్నారు.ఈ కార్యక్రమానికి ఆర్డి ఓ శ్రీనివాసులు, డిఎస్పి ప్రసన్న కుమార్, మైనార్టీ సంక్షేమ అధికారి నరసింహ రావు,తహసీల్దార్ కమలాకర్, వక్స్ బోర్డు ఇన్స్పెక్టర్ మహబూబ్, ముజవర్ జానీ బాబా, మాజీ ఎంపీపీ గోపాల్ మాజీ జడ్పీటీసీ మోతిలాల్ నిమా నాయక్ ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాలుగోన్నారు.