25-01-2026 11:22:48 AM
* మంత్రి ఉత్తమ్ స్పందించాలి
* రాజేష్ కుటుంబానికి న్యాయం చేయాలి
గరిడేపల్లి,(విజయ క్రాంతి): ఇటీవల లాకప్ డెత్ కు గురైన కర్ల రాజేష్,మరణానికి కారకుడైన చిలుకూరు ఎస్ఐ ని విధుల నుండి తొలగించేంతవరకు ఉద్యమం ఆగదని ఎం.ఆర్.పి.ఎస్ మండల ఇన్చార్జి బండారు ఏసన్న, అధ్యక్షులు కొత్తపల్లి రవి డిమాండ్ చేశారు. మండలంలోని సర్వారం గ్రామంలో శనివారం ఆయన మాట్లాడుతూ... కర్ల రాజేష్ మరణానికి కారణమైన చిలుకూరు మండల ఎస్సై ని సస్పెండ్ చేసి, ఇతర శాఖ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకునేంతవరకు ఉద్యమ ఆగదని తెలిపారు.
కర్ల రాజేష్ చనిపోయిన విషయంలో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి వెంటనే స్పందించాలని, రాజేష్ కుటుంబానికి న్యాయం చేయాలని, అతని మరణానికి కారణమైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 5న చలో కలెక్టరేట్ ముట్టడిని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో గరిడేపల్లి ఎంఎస్పి మండల అధ్యక్షులు పోలేపల్లి రాంబాబు, మండల ప్రధాన కార్యదర్శి బరిగెల సతీష్, ప్రచార కార్యదర్శి కడప వీరస్వామి, మచ్చ వేణు, గ్రామ యువకులు,పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.