సమస్యలు పరిష్కరించాలని ఆర్డీవోకు వినతి
కల్వకుర్తి ఏప్రిల్ 17: ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ ఎంప్లాయిస్ టీచర్స్, పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆ ధ్వర్యంలో శుక్రవారం కల్వకుర్తి ఆర్డిఓ జనార్దన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఎమ్మార్వో కార్యాలయం నుండి ఆర్డిఓ కార్యాలయం వరకు ర్యాలీగా చేరుకున్న ఉద్యోగులు, రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు తమ డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పిఆర్సీని అమలు చేయాలని, కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉద్యోగులు, జేఏసీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






