ప్రమాదాల్లో ప్రాణరక్షణకు ‘గోల్డెన్ అవర్’ అత్యంత కీలకం
నాగర్ కర్నూల్ ఏప్రిల్ 17 ( విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాల సమయంలో తొలి గంటను గోల్డెన్ అవర్గా పరిగణిస్తారని, ఆ సమయంలో అందించే వైద్య సహాయం ప్రాణాలను కాపాడడంలో కీలకమని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సీపీఆర్ అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా సీపీఆర్ నిర్వహణ విధానాన్ని ప్రదర్శించి పోలీస్ అధికారులకు అవగాహన కల్పించారు. ప్రమాద సమయంలో తక్షణ స్పందనతో పాటు ప్రాథమిక చికిత్స, సీపీఆర్ చేయడం ద్వారా అనేక ప్రాణాలను రక్షించవచ్చునన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






