2 June, 2026 | 1:18 AM

నూతన్‌కల్ నుండి కానుకుంట వరకు రోడ్డు వేయాలని వినతి

02-06-2026 12:20 AM

కౌన్సిలర్ సద్ది సురేష్ రెడ్డి

మేడ్చల్ అర్బన్ జూన్ 1(విజయక్రాం తి): ఎల్లంపేట్ మున్సిపల్ పట్టణ పరిధిలోని నూతన్ కల్ పట్టణం నుండి కానుకుంట గ్రామానికి వెళ్ళే పంచాయితీ రోడ్డును వే యాలని బిఆర్‌ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ లు సద్ది సురేష్ రెడ్డి,చిన్నోళ్ల భాస్కర్ లు మేడ్చల్ జిల్లా పంచాయతీరాజ్ ఈఈ చం ద్రశేఖర్ ను కలిసి వినతి పత్రం అందజేసిన ట్లు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ నూతన్ కల్ పట్టణం నుండి కానుకుంట గ్రామానికి వెళ్ళే వాహనదారులకు, ప్రభుత్వ,ప్రైవేట్ ఉద్యోగులకు కళాశాలలు, పాఠశాలలకు వెళ్లే వారందరికీ నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు పిఆర్ ఈఈ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఈ నూతన్‌కల్ పట్టణం నుండి కానుకుంట గ్రా మానికి వెళ్ళే రోడ్డు విషయంలో సానుకూలంగా స్పందించిన పంచాయితీ రాజ్ ఈఈ   చంద్రశేఖర్ ఆమ్ ప్రాజెక్ట్ నుండి త్వరగా రోడ్డు పనులు పూర్తి చేయిస్తామని హామి ఇచ్చినట్లు మున్సిపల్ కౌన్సిలర్ లు సద్ది సురే ష్ రెడ్డి, చిన్నోళ్ల భాస్కర్‌లు స్పష్టం చేశారు.