2 June, 2026 | 1:18 AM

టీయూడబ్ల్యూజే సభ్యత్వ నమోదుకు అపూర్వ స్పందన

02-06-2026 12:19 AM

తాడ్వాయి, జూన్, 1(విజయక్రాంతి): టీయూడబ్ల్యూజే సభ్యత్వ నమోదు అపూర్వ స్పందన లభిస్తుందని టీయూడబ్ల్యుజే నాయకులు తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో సోమవారం మండలంలోని జర్నలిస్టులకు టీయూడబ్ల్యూజే సభ్యత్వ నమోదును అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... టియుడబ్ల్యూజే ఆధ్వర్యంలో కామారెడ్డిలో ఈనెల 12న మహాసభ నిర్వహించడం జరుగుతుందని ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే నాయకులు శ్రీనివాస్, రాజేష్,శివ, శ్రీకాంత్, మండల రిపోర్టర్లు మల్లేష్, రాజ్ కుమార్,కృష్ణ చైతన్య గౌడ్, ప్రవీణ్ కుమార్, నరేష్,మురళి తదితరులు పాల్గొన్నారు.