17 August, 2026 | 8:00 AM

అక్రమ నిర్మాణాలు ఆపాలని డీపీవోకు వినతి

24-05-2024 01:44 AM

అబ్దుల్లాపూర్‌మెట్, మే 23, విజయక్రాంతి: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం గౌరెల్లి గ్రామంలో అక్రమ నిర్మాణాలను ఆపాలని బీఎస్పీ నాయకులు డీపీవో సురేష్ మోహన్‌కు వినతి పత్రం అందజేశారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం గౌరెల్లి గ్రామం సర్వే నెంబర్ 206, 191లో పురం బలవంత్ రెడ్డి 600 గజాల స్థలంలో అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా జీ+3 నిర్మాణం చేస్తున్నారని ఎంపీవో, పంచాయతీ కార్యదర్శికి పలుమార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోకుండా బలవంత్ రెడ్డితో బేరసారాలు జరిపి, లంచాలు తీసుకొని ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా వ్యవహరిస్తున్నారని, స్వలాభం కోసం జీ+2 పర్మిషన్ ఇచ్చి జీ+3 వరకు అక్రమ నిర్మాణాలు ప్రోత్సహిస్తున్నారన్నారు.

అక్రమ  నిర్మాణాలపై గతంలో ఫిర్యాదు చేస్తే పంచాయతీ కార్యదర్శి మీద చర్యలు తీసుకుంటామని ఎంపీవో హామీ ఇచ్చారని తెలిపారు. అయితే, చర్యలు తీసుకోక పోగా.. ఎంపీవో, పంచాయతీ కార్యదర్శి  ఇద్దరు కుమ్మక్కై అక్రమ నిర్మాణం చేస్తున్న బలవంతరెడ్డికి లోలోపల సహకరిస్తున్నారని ఆరోపించారు. బీఎస్పీ ఇబ్రహీంపట్నం అధ్యక్షులు గ్యార మల్లేష్ మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలు చేపట్టిన బలవంత్ రెడ్డికి సహకరిస్తున్న ఎంపీవో, పంచాయతీ కార్యదర్శిని నిధులను తక్షణమే తొలగించి, డిమాండ్ చేశారు.

లేని ఎడల అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పేరు చెప్పి ఈ అక్రమ నిర్మాణాలు చేపడుతూ ఎమ్మెల్యే రంగారెడ్డి ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కార్యక్రంలో బీఎస్పీ అసెంబ్లీ కార్యదర్శి ప్రహ్లాద్, అబ్దుల్లాపూర్‌మెట్ మండల అధ్యక్షులు చిత్రం కష్ణ, కాంగ్రెస్ నాయకుల చెంచల ధన్‌రాజ్, చెంచల చిరంజీవి తదిరుతులు పాల్గొన్నారు.