కోమటిరెడ్డి జన్మదినం సందర్భంగా అన్నదానం
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 23 (విజయక్రాంతి) : రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదినం సందర్భంగా గురువారం కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కొమురెల్లి ప్రదీప్ రెడ్డి హయత్‌నగర్‌లోని మానసిక వికలాంగుల సంస్థలో సుమారు 100 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘అన్నా అని పిలిస్తే నేనున్నానంటూ కదిలి వచ్చే నేత, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి‘ అని కొనియాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో ప్రధాన పాత్ర పోషించిన గొప్ప వ్యక్తి వెంకట్‌రెడ్డి అని పేర్కొన్నారు. ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు ప్రదీప్ రెడ్డి తెలిపారు.






