1 April, 2026 | 1:26 AM

గోపాల మిత్రులకు కనీస వేతనం ఇవ్వాలని వినతి

01-04-2026 12:00 AM

నల్లగొండ టౌన్, మార్చి 31: పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న గోపాల మిత్రులకు కనీస వేతనం ఇవ్వాలని మంగళవారం గోపాల మిత్రల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రమేష్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం సంఘ నాయకులు మాట్లాడుతూ గోపాల మిత్రులను ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ పరంగా గుర్తింపు ఇవ్వాలని, కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలన్నారు.

ప్రతి గోపాల మిత్ర కుటుంబ సభ్యునికి ప్రమాద భీమా రూ.6 లక్షలు, మెడికల్ రూ.10 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించా లన్నారు. 25ఇండ్ల నిండి పనిచేస్తున్నందున 10 సంవత్సరాల సర్విస్ ను పరిగణంలోకి తీసుకొని అర్హులైన వారికి శాఖలో ఖాళీ గా ఉన్న ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ లలో భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కావాటి యాదయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ చెరుకు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి నూక మల్లేష్, కోశాధికారి యర్రోళ్ళ సురేష్, సభ్యులు కదిరే దానయ్య ,సైదులు నాగేష్,రవి, ప్రసాద్ శంకర్, ముందు ప్రవీణ్, వెంకటేశ్వర్లు, ప్రసాద్ లాల్ తదితరులు పాల్గొన్నారు.