1 April, 2026 | 1:26 AM

లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల అందజేత

01-04-2026 12:00 AM

మునిపల్లి, మార్చి 31ః మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 10 మంది లబ్దిదారులకు ఉమ్మడి మెదక్ జిల్లా స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ యాదవరెడ్డి సహకారంతో మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను మంగళవారం అందజేశారు. మునిపల్లి మండలం పోల్కపల్లి గ్రామ శివారులో గల పీఎస్‌ఆర్ గార్డెన్ లో మునిపల్లి మాజీ జడ్పీటీసీపైతర మీనాక్షి సాయికుమార్,  బీఆర్‌ఎస్ రాష్ట్ర నా యకుడు పైతర సాయికుమార్, సీనియర్ నాయకుడు గౌడిగామ శివశంకర్ లు చెక్కులను అందించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సీఎంఆర్‌ఎఫ్ పథకం నిరుపేదల గుండెల్లో వెలుగులు నిండుతాయని, అందుకు అర్హులైన వారందరూ సీఎంఆర్‌ఎఫ్ ను సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు చిట్కుల వెంకటేశం, పర శురాం గౌడ్, బక్కన్న, శేఖర్, సర్పంచులు పె ద్దలోడి రాజు, మల్లేశం, ఉప సర్పంచులు ప్రే మానందం, గొర్రె గట్టు కీర్తి, నాయకులు  సంగమేశ్వర్, సంగన్న, గ్రామ పార్టీ అధ్యక్షులు మేతరి మాణయ్య, దత్తు ముదిరాజ్, నాయకులు బక్కన్న, అంజన్న, మధుకర్, అంజన్న, బుచ్చన్న, తుడుం సుభాష్, సుల్తా న్, సురేష్, రవి, రాజు, నవీన్, పవన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.