16 March, 2026 | 5:03 PM

సమస్యలు పరిష్కరించాలని వినతి

16-03-2026 12:21 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి15 (విజయక్రాంతి): ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను  పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నాయకులు ఎమ్మెల్యే కోవ లక్ష్మిని కోరారు. ఆదివారం ఆమెకు సంఘం నాయకులు వినతిపత్రం సమర్పించారు.  రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల బకా యిలు పెండింగ్‌లో ఉండడంతో ఉద్యోగులు, పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ఉద్యోగ ఉపాధ్యాయ సమ స్యలపై అసెంబ్లీలో ప్రస్తావించాలని ఎమ్మెల్యేలను కోరడంతో సానుకూలంగా స్పందించిన ఆమె ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడతానని హామీ ఇచ్చారు. అలాగే గోలేటి గ్రామ పంచాయతీకి చెందిన వార్డు సభ్యులు జమ్మిడి అరుణ్, మిడిగొండ లక్ష్మిలింగమూర్తి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ కార్యక్రమలలో మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్, వైస్ చైర్మన్ అహ్మద్, టీపీయూఎస్ జిల్లా అధ్యక్షుడు ఆడే శ్రావణ్ కుమార్, రాష్ట్ర సహధ్యక్షుడు ప్రభోద్, పార్టీ మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి, గోలేటి సర్పంచ్ బాబూరావు పాల్గొన్నారు.