ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని వినతి
18-04-2026 12:28 AM
చారకొండ, ఏప్రిల్ 17: తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈ జేఏసీ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చారకొండ మండల తహసీల్దార్ ఉమకు ఉద్యోగ సంఘాల నాయకులు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలు, న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. కార్యక్రమంలో శంకర్, ఆంజనేయులు, సుజాత, శివకృష్ణలతో పాటు రెవెన్యూ సిబ్బంది, ప్రభుత్వ ఉపాధ్యాయులు, గ్రామ పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.






