17 April, 2026 | 11:01 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని వినతి

14-06-2025 12:00 AM

సూర్యాపేట, జూన్ 13 (విజయక్రాంతి) : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనీ, ప్రయివేట్ పాఠశాలలు వసూలు చేస్తున్న అధిక ఫీజులను అరికట్టాలని కోరుతూ తెలంగాణ యువజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం సంఘము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు మాట్లాడుతూ ప్రజల ప్రాధమిక హక్కు, ప్రభుత్వం  కనీస బాధ్యత అయిన ఉచిత నాణ్యమైన విద్యను  ప్రభుత్వం అమలు చేయాలన్నారు.

అనుమతుల లేకుండా నిర్వహిస్తున్న ప్రయివేట్ పాఠశాల యాజమాన్యల పై, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడే విధంగా ఫిట్ నెస్ లేని మరియు సేఫ్టీ లేకుండా రోడ్ల పైకి విద్యార్థులతో వస్తున్న  ప్రయివేట్ విద్యాసంస్థల వాహనాల పై, యాజమాన్యలపై  చర్యలు తీసుకోవాలని అన్నారు.

దేవిధంగా అధిక ధరలకి  బుక్స్, స్టేషనరీ అమ్ముతున్న ప్రయివేట్ పాఠశాల యాజమాన్యల పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో రాష్ట్ర నాయకులు భాషిపంగు సునీల్, సంఘము జిల్లా అధ్యక్షులు పోరెళ్ల విప్లవ్ కుమార్, టి ఆర్ వి ఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు బంటు సందీప్, శిలోజు గౌతమ్ చారి, శివ నాయక్ తదితరులు ఉన్నారు.