18 April, 2026 | 4:04 PM

Breaking News

మహిళా సాధికారతకు కాంగ్రెస్సే అడ్డంకి..   •   కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి   •   మహిళా రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ పార్టీ ది వక్రబుద్ధి   •   ఇందిరా క్రాంతి వివోఏలకు ఉద్యమం రిజిస్ట్రేషన్ పై అవగాహన   •   మినీ గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ   •   మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి   •   ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్‌... DA పెంపు   •   హార్ముజ్ జలసంధి మళ్లీ బంద్‌ — ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్— ఇరాన్ సంచలన ప్రకటన   •   రాత్రి 8:30 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం   •  

కూరగాయల మార్కెట్ దుకాణాలను అర్హులకు ఇవ్వాలి

24-06-2025 12:31 AM

బెల్లంపల్లి అర్బన్, జూన్ 23: బెల్లంపల్లి పట్టణ కూరగాయల మార్కెట్ సముదాయాలను అర్హులకు ఇవ్వాలని బీజేపీ పట్టణ అధ్య క్షులు దార కళ్యాణి డిమాండ్ చేశారు. సోమవారం బెల్లంపల్లి మార్కెట్ రోడ్‌లో రాస్తారో కో చేశారు. పట్టణంలోని కూరగాయల మార్కె ట్ షెటర్స్ కేటాయింపుల్లో నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరిగిందని విమర్శించారు. అనర్హులు పేర్లు జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

అనంతరం ఎస్సీ మో ర్చా జిల్లా అధ్యక్షుడు కోడి రమేశ్ మాట్లాడుతూ 30, 40 సంవత్సరాల నుంచి కూర గాయల అమ్ముతూ ఎండనక, వాననక జీవ నం సాగిస్తున్న వారికి మార్కెట్లో షెటర్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కౌన్సిల ర్ భార్యలకు బంధువులకు షట్టర్లు కేటాయించారని ఆరోపించారు. అంతేకాకుండా  లంచాలు తీసుకుని షాప్‌లు కేటాయించారనీ ఆరోపించారు.

అర్హులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని, నిరుపేద, చిరు వ్యాపారుల పక్షాన పోరాడుతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి సెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్‌కుమార్, తాండూర్ మండలం ఇంచార్జ్ మద్దెర్ల శ్రీనివాస్, సీనియర్ నాయకుడు దూది ప్రకాష్,

బీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు ఆకుల శంకర్, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి కోడి సురేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి అరవింద్, పట్టణ ఉపాధ్యక్షులు యుగేందర్, సల్లం సుమలత, పట్టణ కోశాధికారి సంతోష అగర్వాల్, చింతకింది లావణ్య, షేక్ గౌస్ బాబా, కళావతి, రాజేశ్వరి, కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులు పాల్గొన్నారు.