calender_icon.png 5 August, 2025 | 2:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాజ అవసరాలు తీర్చేలా పరిశోధనలు

27-03-2025 12:01:58 AM

  • ఆ ఫలితాలు సామాన్యులకు అందాలి
  • గవర్నర్, ఓయూ ఛాన్స్‌లర్ జిష్ణుదేవ్‌వర్మ

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 26 (విజయక్రాంతి): సమాజ అవసరాలు తీర్చేలా పరిశోధనలు జరగాలని గవర్నర్, ఉస్మానియా యూనివర్సిటీ ఛాన్స్‌లర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఓయూ ఫిజిక్స్ విభాగం ఆధ్వర్యంలో ‘మల్టీ ఫంక్షనల్ మెటీరియల్స్ ఫర్ సొసైటల్ అప్లికేషన్’ అనే అంశంపై  యూనివర్సిటీలో నిర్వహించిన మూడు రోజుల అంతర్జాతీయ సదస్సుకు బుధవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

పరిశోధనల ఫలితాలు సామా   గిరిజనులకు దక్కాలని ఆశించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సును కొత్త పరిశోదనల చర్చ జరగాలని ఆశించారు. వైమానిక రంగంలో వచ్చిన ఆవిష్కరణల గురించి ఓయూ వీసీ ప్రొ.కుమార్ మొలుగారం తెలిపారు. మంచి సమాజాన్ని నిర్మించేందుకు సరికొత్త ఆవిష్కరణ దిశగా పరిశోధనలు జరగాలని ఎఎండీ హైదరాబాద్ డైరెక్టర్ ధీరజ్  పాండే అన్నారు.

ఆధునికసాంకేతికత ఆధారంగా ఫిజిక్స్‌లో పరశోధనలు వేగంగా జరుగుతున్నాయని సదస్సు కన్వీనర్, ఫిజిక్స్ హెచ్‌వోడీ ప్రొ.ఎం. శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ జి.నరేష్‌రెడ్డి, ఓఎస్డీ ప్రొ.జితేంద్రకుమార్‌నాయక్ పాల్గొన్నారు.

కాగా ఓయూలో గవర్నర్ పర్యటన సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ సంఘాల నాయకులను ఓయూ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. వారిలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎల్ మూర్తి, ఏఐఎస్‌ఎఫ్ ఓయూ కార్యదర్శి నెల్లి సత్య, నాయకుడు ఉదయ్, పీడీఎస్‌యూ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మంద నవీన్, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్‌కే ఆసిఫ్ ఉన్నారు.