05-08-2025 02:26:36 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికి కార్డన్ సెర్చ్(Cordon search ) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బయ్యారం సీ ఐ రవికుమార్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) బయ్యారం పోలీస్ స్టేషన్ పరిధిలోని జగన్నాథ తండా గ్రామంలో మంగళవారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా లభించిన 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఐదు వేల రూపాయల విలువైన మద్యాన్ని పట్టుకున్నారు. 40 లీటర్ల గుడుంబా, 600 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బయ్యారం ఎస్సై కోగిల తిరుపతి, గార్ల ఎస్సై రియాజ్ పాషా, సిబ్బంది పాల్గొన్నారు.