calender_icon.png 5 August, 2025 | 4:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరాలపై దుకాణదారులకు అవగాహన: ఎస్ఐ కృష్ణ రెడ్డి

05-08-2025 02:29:12 PM

జగదేవపూర్: జగదేవపూర్ మండల(Jagdevpur Mandal) కేంద్రంలో స్థానిక ఎస్ఐ కృష్ణారెడ్డి సైబర్ నెరాలపై దుకాణ దారులకు పెట్రోల్ పంప్, వైన్స్ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ... గుర్తుతెలియని వ్యక్తులు ఎవరైనా ఏదయినా వస్తువు కొనుకొని ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు చెల్లించినట్టు గ్రీన్ కలర్ వచ్చే ఫేక్ అప్ లు ఉపయోగించి డబ్బులు కొల్లగొడుతున్నారని తెలిపారు. ఎవరైనా డబ్బులు చెల్లించినా వెంటనే ఫోన్లో డబ్బులు వచ్చినాయ లేదా చూసుకోవాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ జనార్ధన్, కానిస్టేబుళ్లు లింగం, బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.