calender_icon.png 5 August, 2025 | 4:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అంతా ట్రాష్, బేస్‌ లెస్‌

05-08-2025 01:07:32 PM

  1. కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు
  2. కాళేశ్వరం అసలు నిజాలన్నీ అసెంబ్లీలో వివరిస్తాం
  3. కేసీఆర్ ను హింసించడమే లక్ష్యంగా పాలన

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై(Kaleshwaram project) తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు మంగళవారం నాడు ప్రజెంటేషన్ ఇచ్చారు. జిల్లాల్లో బీఆర్ఎస్ కార్యాలయాల్లో నేతలు తిలకించేలా స్క్రీన్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సాగుకునీరు, సరిపడా యూరియా లేదని ఆందోళనలు ఎక్కువయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో కమిషన్ల పాలన సాగుతోందని ఆరోపించారు. ప్రతిపక్షాలపై కక్ష సాధింపు కోసం రాజకీయ కమిషన్లు వేశారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ(Congress, BJP) కలిసి బీఆర్ఎస్ పై కుట్ర చేస్తున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. పోలవరం మూడుసార్లు కుప్పకూలితే ఎన్డీఎస్ఏ పోలేదు, రిపోర్టు ఇవ్వలేదు.. కుట్ర పూరితంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టును(Kaleshwaram Commission Report) బయటపెట్టారని ఆయన ధ్వజమెత్తారు. కమిషన్ విచారణలపై మాకు నోటీసులు రాకముందే మీడియాకు తెలిసేది.. నిన్న బయటపెట్టిన రిపోర్టులో అంతా అబద్ధాలు, అవాస్తవాలు ఉన్నాయని హరీశ్ రావు కొట్టిపాడేశారు. అసెంబ్లీలో 655 పేజీల రిపోర్టు బయటపెడితే మేం చీల్చి చెండాడతామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అసలు నిజాలన్నీ అసెంబ్లీలో వివరిస్తామని పేర్కొన్నారు. తమకు అనుకూలంగా ఉన్న విషయాలనే నిన్న బయటపెట్టారని వివరించారు.

కాళేశ్వరానికి అనుమతులు(Kaleshwaram Permission) ఇచ్చిన కేంద్రానిది కూడా తప్పే అన్నట్లుగా రిపోర్టు ఉంది.. కమిషన్ ఒకవైపే చూసి, ఒకవైపే విని ఏకపక్షంగా రిపోర్టు ఇచ్చినట్లు ఉందని చెప్పారు. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు అంతా ట్రాష్, బేస్ లెస్ గా ఉందని ఎద్దేవా చేశారు. కమిషన్లు ఇచ్చిన రిపోర్టులు న్యాయస్థానంలో నిలబడవని తేల్చిచెప్పారు. తన పాలనావైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రయత్నిస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. కేసీఆర్ ను హింసించడమే లక్ష్యంగా పాలన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మహారాష్ట్రతో చారిత్రాత్మక ఒప్పందం చేసుకుని కాళేశ్వరం నిర్మించామన్నారు. తుమ్మిడిహట్టికి అన్ని అనుమతులు సాధించామని ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) అబద్ధాలు చెప్పారని విమర్శించారు. ఏడేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహట్టిని ఎందుకు చేపట్టలేదన్నారు. ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టునైనా నిర్మించిందా? అని ప్రశ్నించారు. ధవళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కాటన్ మీద కూడా ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం కమిషన్ వేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ ను కూడా భవిష్యత్ తరాలు దేవుడిగా కొలుస్తాయని చెప్పారు. గంధమల్ల నుంచి గోదావరి జలాలు తెచ్చి మూసీలో పోస్తామని సీఎం అంటున్నారు.. కాళేశ్వరం పనికిరాకుండా పోతే.. గంధమల్లకు గోదావరి జలాలు ఎలా వస్తున్నాయన్నారు. మల్లన్న సాగర్ నుండి నీళ్లు మూసీలోకి నీళ్లు పోయడానికి రూ.6000 కోట్లకు టెండర్లు ఫైనల్ చేశారని, మల్లన్నసాగర్ ప్రాజెక్టు కాళేశ్వరంలో భాగమే అన్నారు. కాళేశ్వరం కూలిందని అబద్దపు మాటలు చెప్పి.. గందమల్లకు కొబ్బరికాయలు కొట్టి, మల్లన్నసాగర్‌కు టెండర్లు ఎలా ఖరారు చేస్తారని సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీష్ రావు