వరంగల్ బస్టాండ్‌లో చిన్నారి కిడ్నాప్
వరంగల్ బస్టాండ్ లో చిన్నారి అపహరణ.
కిడ్నాప్ వరంగల్లో కలకలం రేపింది.
వరంగల్/హన్మకొండ,(విజయక్రాంతి): బిహార్ రాష్ట్రం(Bihar State) వైశాలి జిల్లా మన్నార్ కు చెందిన వకీల్ కు భార్య, ముగ్గురు పిల్లలు. మూడు నెలల క్రితం భార్య చనిపోవడంతో ఇద్దరు కుమారులు,14 నెలల పాపతో బతుకుదె రువు కోసం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు చేరుకున్నాడు. షాద్ నగర్ కు వెళ్లే క్రమంలో పొరపాటున గోదావరి రైలు ఎక్కి శనివారం అర్ధరాత్రి వరంగల్ రైల్వే స్టేషన్ కు వచ్చాడు. ఉదయం హైదరాబాద్ కు వెళ్దామను కొని పక్కనే ఉన్న వరంగల్ బస్టాండ్(Warangal bus stand)కు వచ్చి పిల్లలతో కలిసి పడుకున్నాడు. ఆదివారం తెల్లవారుజామున వకీల్ కుమార్ చూసేసరికి 14 నెలల చిన్నారి కనబడకపోవడంతో గుర్తు తెలియని వారు కిడ్నాప్ చేసినట్లు వకీల్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో ఇంతేజార్ గంజ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.






