calender_icon.png 5 August, 2025 | 4:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాత్రాజ్ పల్లిలో సబ్ స్టేషన్ మంజూరుతో ఐదు గ్రామాల రైతుల్లో ఆనందం

05-08-2025 01:45:58 PM

మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటాలకు క్షీరాభిషేకంలో మాజీ జడ్పిటిసి జగన్ మోహన్ రావు

ముత్తారం, (విజయ క్రాంతి):  మండలంలోని శాత్రాజ్ పల్లి గ్రామంలో సబ్ స్టేషన్ మంజూరుతో ఐదు గ్రామాల రైతుల్లో ఆనందం మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) నింపాడని ఆ ఆనందంతో మంగళవారం ముత్తారం మండల కేంద్రంలో మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబు చిత్రపటాలకు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ జడ్పిటిసి నాగినేని జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... మూడు కోట్ల రూ. 40 లక్షల వ్యయంతో సబ్ స్టేషన్ నిర్మాణం కోసం కృషిచేసిన అభివృద్ధి ప్రదాత రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శ్రీను బాబు అని చిత్రపటానికి క్షీరాభిషేకంలో ఐదు గ్రామాల ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు.

గత పాలకులు ఐదు గ్రామాల ప్రజలను విస్మరించి శాత్రాజ్ పల్లి గ్రామ అభివృద్ధి చెందకుండా అడ్డుకున్నారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక శ్రీధర్ బాబు దృష్టికి మేము తీసుకపోవడం ద్వారానే ఈ సబ్ స్టేషన్ మంజూరు చేయించడమే కాకుండా, ఏడు కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్డు కు హామీ ఇచ్చారని అన్నారు. మంథని నుంచి ఓడేడు వరకు రూ. 60 కోట్ల రూపాయలతో రోడ్డు మంజూరు చేయించి, సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయబోతున్నారని, గత 10 ఏండ్లు అధికారంలో ఉన్న పాలకులు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి అర్హులైన కుటుంబానికి రేషన్ కార్డు అందజేసిన ఘనత శ్రీధర్ బాబు దే అని కొనియాడారు. 

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతుంది శ్రీధర్ బాబు కాదా అని ప్రతిపక్షాన్ని జగన్ ప్రశ్నించారు. మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం, రైతులకు రుణమాఫీ, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్, కల్పించిన ఘనత సీఎం తో పాటు శ్రీధర్ బాబుదే అన్నారు. ఇవే కాకుండా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ మంథని కాకుండా రాష్ట్ర ప్రజల మన్ననలు పొందుతున్న వ్యక్తి ప్రజల దైవం శ్రీధర్ బాబు అని కొనియాడారు.  ఇందిరమ్మ ఇండ్లను పేదలకు ఇప్పించి పేదల కండ్లల్లో ఆనందం నింపుతున్నాడని, మంత్రి గా శ్రీధర్ బాబు ఘనత ఎంత చెప్పిన తక్కువేనన్నారు. ఆయన అభివృద్ధిని ప్రతిపక్షాలు కల్లుండి చూడలేక కుళ్ళిపోతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అల్లాడి యాదగిరిరావు,కమాన్ పూర్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు మద్దెల రాజయ్య, డైరెక్టర్ బుచ్చం రావు, మాజీ సర్పంచులు తాటిపాముల వకుళారాణి శంకర్,  రాపల్లి రామన్న, మాజీ ఎంపీటీసీ మల్యాల రాజయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ చారి, సూదాటి సంపత్ రావు, గుజ్జ లింగారావు, మహిళా నాయకురాలు పారునంది ధనలక్ష్మి, దాసరి చంద్రమౌళి, గౌడ్ తదితరులు పాల్గొన్నారు.