20-01-2026 12:03:27 AM
ఆశావాహుల ఉత్సాహం, సింహం భాగం సీట్లు వారికే..
మహిళా కోటాలో ప్రత్యేకంగా 50 శాతం అమలు
జనరల్ కేటగరీలోనూ బరిలో నిలవనున్న అతివలు
రిజర్వేషన్లు మహిళలకే అనుకూలం
ఉమ్మడి ఖమ్మంలో పోటాపోటీ..
మణుగూరు, జనవరి 19 (విజయక్రాంతి): ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లోనూ తమకు నచ్చిన పని చేసుకుం టూ పురుషులకు దీటు గా నిలుస్తున్నారు. తాము ఎందులోనూ తక్కువ కాదన్నట్లుగా అడుగు ముందుకేసి విజయతీరాలకు చేరుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో త్వరలో జరిగే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల లో పీఠాలను మహిళలే ఏలనున్నారు. మెజార్టీ చైర్ పర్సన్ స్థానాలను మహిళలకు రిజర్వ్ చేశారు.
దీనితో ఎన్నికల్లో అధిక సంఖ్యలో మహిళలు బరిలోకిదిగే అవకాశాలు స్పష్టం గా కనిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్లతో పాటు ప్రత్యేక మహిళా కోటాతో కలిపి ప్రభుత్వం వారికి మొత్తంగా 50 శాతం సీట్లు కేటాయించింది. దీంతో రాజకీయ పార్టీలు సైతం మహిళలను రంగంలోకి దింపేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. చట్ట సభలలోకి నారీ మణులు ప్రస్థానంపై విజయక్రాంతి ప్రత్యేక కథనం..
సింహభాగం సీట్లు మహిళా మహారాణులకే ..
ఖమ్మం జిల్లాలో ఉన్న ఏకైక మున్సిపల్ కార్పొరేషన్ ఖమ్మం మేయర్ జనరల్ మహిళకు కేటాయించగా, కొత్తగూడెం కార్పొరేషన్ ఎస్టీ జనరల్‌కాగా, ఖమ్మం జిల్లాలో ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. 5 స్థానాలు మహిళకే రిజర్వ్ కాగా, 2 స్థానాలు జనరల్ కేటగిరికి, మరో స్థానం బీసీ జనరల్‌కు కేటాయించారు. ఏదులాపురం చైర్ పర్సన్ని ఎస్సీ మహిళకు, మధిర, సత్తుపల్లి, వైరా చైర్ పర్సన్ స్థానాలను జనరల్ మహిళకు రిజర్వ్ చేశారు. కల్లూరు మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని మాత్రం ఎస్టీ జనరల్ కు కేటాయించారు. అన్ని మున్సిపాలిటీల్లోని వార్డుల్లో సగం స్థానాలను మహిళలకు కేటాయించారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎస్టీ జనరల్‌కు కేటాయించగా, అశ్వరావుపేట మున్సిపల్ చైర్మన్ జనరల్ మహిళ, ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ బీసీ మహిళకు కేటాయిస్తూ అధికారికంగా ప్రకటించారు.
అదృష్ట మహారాణుల కోసం...
మున్సిపల్, కార్పొరేషన్ పుర పోరులో అధిక స్థానాలు మహిళలను వరించడం తో ఆ అదృష్ట మహారాణుల కోసం ప్రధాన పార్టీలు వెతుకులాట మొదలు పెట్టాయి.ఇప్పటి దాకా రాజకీయానుభవం లేకపోయినా, రిజర్వేషన్లు అనుకూలించడంతో తమ కుటుంబాల్లోని మహిళలను పోటీలో నిలబెట్టడం ద్వారా పురుషులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే నిర్ణయంతో ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు మహిళలు బరిలో నిలిస్తే ఆ విభాగం ఓట్లు తేలిగ్గా రాబట్టుకోవడంతోపాటు, చట్ట సభల్లోకి నారీ మణులు అధికంగా వెళ్లేలా ప్రజలే ప్రోత్సహించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మహిళల భాగస్వామ్యం పెరగనుంది. జిల్లాలోని అధిక మున్సిపాలిటీలు మహిళలకు రిజర్వు కావడంతో పీఠం అధిరోహించే అదృష్టం ఎవరికి దక్కనుందనే ఆసక్తి నెలకొంది.
తామొకటి తలిస్తే..
మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావించి ఎంతో ఉత్సాహంగా ఉన్న ఆశావహులు (పురుష నేతలు) రిజర్వే షన్లు మహిళలకు అనుకూలంగా రావడంతో పూర్తిగా నీరుగారిపోయారు. ఏం చేయాలో పాలుపోని స్థితిలోకి జారిపో యినట్లు తెలుస్తోంది. రిజర్వేషన్ల కారణంగా భార్యలను బరిలో దింపి తెరవెను క రాజకీయం చేసేందుకు సిద్ధపడుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో పోటా పోటీ..
ఈసారి ఖమ్మం, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పదవికి జరగబోయే ఎన్నికలు మామూలుగా ఉండవనే చర్చ జోరుగా సాగుతోంది. అధికార పార్టీకి, దీటుగా విపక్షాల అభ్యర్థులు మధ్య పోటీ దీటు గా ఉండే అవకాశాలెక్కువగా కనిపిస్తున్నాయి. అందు కు తగ్గట్లుగానే బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు ఆచితూచి అభ్యర్థి ఎంపి కలో పార్టీలు ఆచితూచి అడుగేస్తున్నట్లు తెలుస్తోంది. మహిళా ఓటర్లను ఆకర్శించేందుకు జనరల్ స్థానాల్లో కూడా కొందరు మహిళల ను రంగంలోకి దింపాలని ఆయా పార్టీల ముఖ్య నేతలు భావిస్తున్నారు.గత అసెంబ్లీ, పార్లమెంట్తోపాటు ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనూ మహిళా అభ్యర్థులే గెలుపోటములను నిర్ణయించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
ప్రస్తుత మునిసిప ల్ ఎన్నికల్లోనూ అదే ఒరవడి పునరావృతం కానుండటంతో వివిధ పార్టీ లకు చెందిన ముఖ్య నేతలు సైతం ఎక్కు వగా మహి ళలకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. మహిళ సంక్షేమ పథకాలు ద్వారా గెలుపు సునాయాసం అవుతు ందని అధికార పార్టీ నాయకులున్నారు. కాంగ్రెస్తోపాటు ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్‌ఎస్, సిపిఐ, సిపిఎం లు సైతం మహిళలను రంగంలోకి దింపాలన్న యోచనలో ఉన్నాయి. జనరల్ స్థానాల్లోనూ అధిక సంఖ్యలో మహిళలను రంగంలోకి దింపితేనే తమ పని సులువు అవుతుందనే భావనలో ఆయా పార్టీల నాయకులు ఉన్నారు. మొత్తం మీద మున్సిపల్ ఎన్నికల రాజకీయం ఉమ్మడి జిల్లాలో ఆసక్తికరంగా మారింది.