20-01-2026 12:04:13 AM
రేగొండ,జనవరి 19(విజయాక్రాంతి):భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విజయక్రాంతి దినపత్రిక2026 క్యాలెండర్ను భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు సోమవారం ఆవిష్కరించారు.ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో క్యాలెండర్ను విడుదల చేసి విజయక్రాంతి యాజమాన్యం, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విజయక్రాంతి దినపత్రిక ప్రజా సమస్యలపై నిర్భయంగా స్పందిస్తూ, గ్రామీణ ప్రాంతాల సమస్యలను ప్రజల ముందుకు తీసుకెళ్తోందని ప్రశంసించారు.నిష్పక్షపాత జర్నలిజంతో ప్రజలకు సత్యమైన వార్తలను అందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బట్టు కరుణాకర్, తిరుమలగిరి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిమ్మల విజేందర్,స్థానిక నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.