12 April, 2026 | 6:30 PM

లక్కీ డ్రా ద్వారా 15 మంది ఉచిత కీలు మార్పిడికి ఎంపిక

12-04-2026 04:55 PM

కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కేంద్రంలోని  రెనే హాస్పిటల్ లో ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా రోబోటిక్ మోకాలు కీలుమార్పిడి చికిత్సను బి.ఆర్.ఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఘనంగా ప్రారంభించారు. రెనే హాస్పిటల్లో వాలిస్ కంపెనీకి చెందిన సుమారు ఐదు కోట్ల విలువ చేసే అత్యాధునిక రోబోటిక్ సర్జరీ యంత్రాన్ని కెటిఆర్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ... ఇలాంటి అత్యాధునిక వైద్య సదుపాయాలను జిల్లా కేంద్రాల్లో కూడా అందుబాటులోకి తెచ్చిన రెనే హాస్పిటల్ చైర్మన్ ప్రొఫెసర్ డా.బంగారి స్వామిని డా.రజనీ ప్రియదర్శినిలను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా చైర్మన్ డా.బంగారి స్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తన తల్లి దండ్రులు కీర్తి శేషులు బంగారి లక్ష్మి, మైసయ్య పేరుపై ప్రతి సంవత్సరం సుమారు యాభై లక్షల రూపాయల విలువగల సర్జరీలను చేయడం జరుగుతుంది తన సతీమణి డా.రజని ప్రియదర్శిని ఈ వైద్య రంగంలో ఉన్నన్ని రోజులు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తమ కుటుంబం అంతా వైద్య సేవకే అంకితం అని అన్నారు. ఈ ఉచిత లక్కీ డ్రా కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా పూర్తి పారదర్శకంగా నిర్వహించామన్నారు.

సుమారు 180 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వారిలో నుండి 15 మందిని ఎంపిక చేసి వారికి పూర్తి ఉచితంగా మోకాలు కీలు మార్పిడి చికిత్సను రాబోయే నెల రోజుల్లోగా నిర్వహిస్తామని అన్నారు. మిగతా వారికి అతి తక్కువ ఖర్చులో ఈ ఆపరేషన్ చేస్తామని ఈ సదవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎమ్మెల్యే  గంగుల కమలాకర్, మున్సిపల్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సుడా చైర్మన్ జి.వి.రామకృష్ణా రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, గ్రంధాలయ సంస్థ మాజీ అధ్యక్షులు పొన్నం అనిల్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి,  రఘువీర్ సింగ్, మాజీ మున్సిపల్ మేయర్ రవీందర్ సింగ్,  తిరుపతి రెడ్డి, మహేందర్, సురేందర్, తదితరులు పాల్గొన్నారు.