గాన కోకిలను కోల్పోయిన భారత్… ఆశా భోస్లే మరణంపై మోదీ భావోద్వేగ స్పందన!
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ గాయని ఆశా భోంస్లే మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఆమెను భారతదేశం ఇప్పటివరకు చూసిన అత్యంత ప్రతిష్టాత్మకమైన, బహుముఖ ప్రజ్ఞ గల స్వరాలలో ఒకటి అని అభివర్ణించారు. ఆమె అసాధారణ సంగీత ప్రయాణం దేశ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేసిందని, ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని హృదయాలను స్పృశించిందని ప్రధాని మోదీ ఎక్స్ పోస్ట్‌లో తెలిపారు.
ఇంకా ఇలాంటి సినీ, సంగీత వార్తల కోసం మా ఎంటర్టైన్‌మెంట్ కేటగిరీని ఫాలో అవ్వండి
అలాగే గాయని ఆశా భోంస్లే మరణం తనకు అత్యంత బాధాకరమని నటి, రాజకీయవేత్త హేమా మాలిని పేర్కొన్నారు. ఆశాజీతో తనకు భావోద్వేగ అనుబంధం ఉందని, తనదైన ప్రత్యేకమైన గాత్రం, శైలితో ఆమె తను నటించిన సినిమా పాటలెన్నింటిని ఎంతో ప్రాచుర్యం కల్పించారు, అంటూ హేమా మాలిని తన విచారాన్ని వ్యక్తం చేశారు.
తాజా టెక్నాలజీ, బిజినెస్ వార్తల కోసం మా Vijayakranthi News హోమ్‌పేజీని సందర్శించండి.






