12 April, 2026 | 6:33 PM

ఇంటర్మీడియట్ ఫలితాల్లో బెల్లంపల్లి సీఓఈ ప్రభంజనం

12-04-2026 04:58 PM

బెల్లంపల్లి,(విజయ క్రాంతి): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సెంట్రల్ ఆఫ్ ఎక్స్లెన్స్ బెల్లంపల్లి ఇంటర్మీడియట్ ఫలితాలలో విజయకేతనం ఎగరవేశారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ ఫలితాల వివరాలను ప్రిన్సిపాల్ ఆకిడి విజయసాగర్ వెల్లడించారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ 1000 మార్కులకు గాను కొదురుపాక మన్వీత్ 987 మార్కులు సాధించారు. మైలారపు విశ్వతేజ 984 మార్కులు, దౌనే ఆదర్శ్ 983 మార్కులు సాధించారు.

ద్వితీయ సంవత్సరం బైపిసి 1000 మార్కులకు గానుమార్కులు ఇప్ప శ్రీరామ్ 980 మార్కులు సాధించారు. జాదవ్ పృథ్వీరాజ్ నాయక్ 977, దుర్గం శివరాం 976, మార్కులు సాధించారు. మొదటి సంవత్సరం ఎంపీసీ 470 మార్కులకు గాను గాంధార్ల అక్షయ్ 467 మార్కులు సాధించారు, బోర్కూటి కౌశిక్ 466, పెరుగువార్ సృజన్ 465 మార్కులు సాధించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బైపిసిలో 440 మార్కులకు గాను కొంపల్లి రాకేష్ 431 మార్కులు సాధించారు.

శ్రీరామ రక్షిత్ చారి 429, గడ్డం వశీకర్ 425, మార్కులు సాధించారని ప్రిన్సిపాల్ ఆకిడి విజయసాగర్ తెలిపారు. విద్యార్థులను ఆయన అభినందించారు. అదేవిధంగా మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ లో 100% ఫలితాలు సాధించడం పట్ల డి సి ఓ రమాకల్యాణి, జె డ్ ఓ గిరిజ మేడం విద్యార్థులను  ఉపాధ్యాయులను  అభినందించారు. పాఠశాల కళాశాల అధ్యాపక బృందం విద్యార్థులను అభినందించారు.