ఖానాపూర్ మున్సిపాలిటీలో కోతుల ఏరివేతకు తీర్మానం
ఖానాపూర్, జూన్ 24 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశం బుధవారం ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయంలో జరిగింది. మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై తీర్మానం చేశారు.
ప్రధానంగా పట్టణంలో తీవ్ర సమస్యగా ఉన్న కోతులను పట్టి నిర్మల్ పునరావాస కేంద్రానికి తరలించడం, వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని దోమలు ఏర్పడకుండా కాలనీలో ఫాగింగ్ బ్లీచింగ్ పౌడర్ పిచికారి, ఎన్టీఆర్ చౌరస్తా నుండి అంగడి బజార్ వరకు రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు , కూలిపోయిన పాత మురికి కాలువలు మరమ్మతులు, గోదావరి నది వద్ద శాశ్వత వాటర్ షవర్లు, ప్లాట్ఫారం నిర్మించడం, విద్యుత్ దీపాలు ఏర్పాటు,కాలనీ లలో విద్యుత్తు స్తంభాల స్థానంలో నూతన స్తంభాల ఏర్పాటు ,వంటి తీర్మానాలు చేసినట్లు మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక తెలిపారు.
ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మొహమ్మద్ షోయబ్ హుస్సేన్, కౌన్సిలర్లు గొర్రె తిరుమల, తాళ్లపల్లి రాజా గంగన్న, సాజియా బేగం జమాల్ ,గుమ్ముల ఆనంద్ కుమార్ ,మేసాపోసాని ,నిమ్మల రమేష్, బొప్పారం సత్యవతి, బండి పల్లి సింధుజ ప్రకాష్ గౌడ్, చిన్నం సత్యనారాయణ ,మున్సిపల్ మేనేజర్ సురేందర్, తదితరులు పాల్గొన్నారు.






