calender_icon.png 21 February, 2026 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాటుసారా, బెల్ట్‌షాపులను బంద్ చేయించాలి

21-02-2026 12:35:34 AM

లింగాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ గుగులోతు మంగ 

కొత్తపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ గంప నాగలక్ష్మి

నూతన గ్రామ పంచాయతీ కమిటీల ఆధ్వర్యంలో తీర్మానం

చర్ల, ఫిబ్రవరి 20, (విజయక్రాంతి): గ్రామాల్లో మద్యం బెల్టు షాపులు, నాటు సారా వంటివి ఎవరైనా నిర్వహిస్తే చర్యలు చేపడతామని లింగాపురం కొత్తపల్లి నూతన గ్రామ పంచాయితీ కమిటీ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా లింగాపురం, కొత్తపల్లి గ్రామపంచాయతీల సర్పంచులు మాట్లాడుతూ గ్రామాల్లోని కుటుంబాల ఆర్థిక, ఆరోగ్య స్థితిగతులను మెరుగుపరచడానికి సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయడం కష్టమైన పనే కానీ గ్రామాల్లో బెల్టు షాంపులను బందు చేయించడం చాలా అవసరమని లింగాపురం సర్పంచ్ గుగులోతు మంగా, కొత్తపల్లి  సర్పంచ్ గంప నాగలక్ష్మి గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.

మండల పరిధిలోని కొత్తపల్లి, లింగాపురం గ్రామాలు గ్రామ సభల ద్వారా ఏకగ్రీవంగా తీర్మానాలు చేసుకుని, బెల్టు షాపులను తొలగించి, జరిమానాలు విధిస్తూ మద్య నిషేధాన్ని మహిళా సంఘాలు విజయవంతంగా అమలు  చేస్తున్నాయని. గ్రామ సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ఆధ్వర్యంలో గ్రామసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి, మద్య విక్రయాలు, నాటు సారా, గుడుంబా, బెల్టు షాపులు నిషిద్ధమని ప్రకటించారు.

ఇదే పరిస్థితి ప్రతి గ్రామపంచాయతీలో తెస్తే కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని ప్రజలు భావిస్తున్నారని నిబంధనలను అతిక్రమించి మద్యం అమ్మిన వారికి భారీ జరిమానాలు విధించడం, అలాగే సమాచారం ఇచ్చిన వారికి నజరానాలు ప్రకటించడం మంచిపనిగా ప్రజలు భావిస్తున్నారని గ్రామస్తులందరి సమక్షంలో మద్యపానానికి దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయడం ద్వారా సామాజిక చైతన్యం తీసుకురావడం జరుగుతుందని అన్నారు.

ప్రతి గ్రామ పంచాయితీ ఇలా తీర్మానం చేస్తే ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు బాగుపడతాయని స్థానిక మహిళలు  ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని ఇటీవల కాలంలో చర్ల మండలంలో ఐదారుగురు వ్యక్తులు అతిగా మద్యం సేవించి, నాటు సారా కారణంగా యుక్త వయసులోనే మద్యపానానికి బానిసలై చనిపోయారు, ప్రతి గ్రామంలో గుడుంబా బెల్టు షాపులు తీసివేయడం  వల్ల కాలేయ వ్యాధులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షణ లభిస్తుందని మహిళలు, యువకుల మద్దతుతో బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపడం, గ్రామ అభివృద్ధిని కాంక్షించడం అవుతుందని రెండు గ్రామాల సర్పంచులు అంటున్నారు. ఈ చర్యలు గ్రామాల్లో శాంతిభద్రతలను పెంపొందించడమే కాకుండా, కుటుంబాల్లో సంతోషాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని నిలబెడతాయి కొత్తపల్లి లింగాపురం గ్రామ  ప్రజలు, సర్పంచ్లు అంటున్నారు.