18 August, 2026 | 1:46 AM

ప్రజావాణిలను సత్వరమే పరిష్కరించండి

18-08-2026 12:00 AM

నిర్మల్, ఆగస్టు 17 (విజయక్రాంతి): ప్రజావాణి దరఖాస్తుల ను వెంటవెంటనే పరిష్కరించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొ న్నారు.  ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వయంగా స్వీకరించారు.  మాట్లాడుతూ, ఆయా శాఖల అధికారులు ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు.

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా, ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులను కలెక్టర్ కు సమర్పించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు (రెవెన్యూ) కిషోర్ కుమార్, డిఆర్‌ఓ రాథోడ్ రమేష్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.