18 August, 2026 | 1:14 AM

ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి

18-08-2026 12:00 AM
  1.    26న డీటీయూ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విద్యా సదస్సు
  2. ధర్మా టీచర్స్ యూనిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుంకర శ్రీనివాస్ ముదిరాజ్ 

ముషీరాబాద్,ఆగస్టు 17(విజయక్రాంతి): తెలంగాణలో విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లు, పరిష్కారాలపై డీటీ యూ ఆధ్వర్యంలో ఈ నెల 26న బాగ్ లిం గంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విద్యా సదస్సు నిర్వహించనున్నట్లు ధర్నా టీచర్స్ యూనిటీ కన్వీనర్ సుంకర శ్రీనివాస్ ముదిరాజ్ తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకా యిలను వెంటనే విడుదల చేయాలని ఆయ న డిమాండ్ చేశారు.

ఈ మేరకు సోమవా రం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పలువురు డీటీయూ ప్రతినిధులతో కలిసి మాట్లాడు తూ ఫీజు రీయింబర్స్మెంట్ ఆలస్యం వల్ల వి ద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆర్థిక సమస్యల కారణంగా ఒక్క విద్యార్థి కూడా చదువును ఆపకూడదని పేర్కొన్నారు.కాలేజీలు ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఫీజు రీయింబర్స్మెంట్కు స్పష్టమైన టైమ్లైన్ ప్రకటించాలని కోరారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు విద్య హక్కుదానం కాదు అని స్పష్టం చేశారు. సదస్సులో ప్రముఖ విద్యావేత్త ఆర్. వెంకటరెడ్డి, తెలుగు అకాడమీకి చెందిన కూరపాటి వెంకట నారాయణ, ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, డా. టి. చిరంజీవులు, ప్రముఖ సామాజికవేత్త డా. విశారదన్ మహారాజ్, పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ నాగం కుమారస్వామి పాల్గొననున్నారని తెలిపారు.

విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం విద్యార్థి సంఘాలతో చర్చించి శాశ్వత పరిష్కారం చూపాలని, సమస్య పరిష్కారం అయ్యే వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం కొనసాగి స్తామన్నామని తెలిపారు. ఈ సమావేశంలో తమతో కన్వీనర్లు ఉపేందర్, రమేష్, అశోక్, సుధాకర్, రవిచంద్ర, రాజు, ప్రభుత్వ విద్యాశాఖ సభ్యులు జనార్దన్, భాస్కర్, అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.