29 April, 2026 | 3:21 AM

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించండి

29-04-2026 01:38 AM
  1. సమాచార శాఖ స్పెషల్ కమిషనర్‌కి ఫెడరేషన్ విజ్ఞప్తి
  2. ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులపై చొరవచూపాలని వినతి 

హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): రాష్ట్రంలో జర్నలిస్టులు దీర్ఘకాలికం గా ఎదుర్కొంటున్న సమస్యలను వేగంగా పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమి టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మంగళవారం హైదరాబాద్‌లోని సమాచార భవన్ లో స్పెషల్ కమిషనర్ ముకుంద్ రెడ్డిని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవ పున్నయ్య నేతృత్వంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.రాజశేఖర్, గుడిగ రఘు, కార్యదర్శులు బి జగదీశ్వర్, గండ్ర నవీన్ కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. గత 40 ఏండ్లుగా తెలంగాణ లో జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇవ్వలేద ని గుర్తు చేశారు.

అక్రెడిటేషన్ల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా డెస్క్ జర్నలిస్టులు ఆందోళనతో ఉన్నారనీ, ప్రింటింగ్ కేంద్రాలతోపాటు జిల్లా కేంద్రాల్లో అవసరమైన మేర అక్రిడిటేషన్ కార్డులను జారీచేయాలని కోరారు. హె ల్త్ కార్డులను ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జర్నలిస్టులకు కూడా ఇవ్వాలనీ, జర్నలిస్టుల తరపున కంట్రిబ్యూషన్ ప్రభుత్వం చెల్లించే లా చర్యలు తీసుకోవాలన్నారు. రిటైరైన జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నా రు.  ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకమైందన్నారు.