దొంగ ఓట్లకు తావు ఉండొద్దు!
డబుల్ ఓట్లను తొలగింపజేయాలి
- కాంగ్రెస్, బీజేపీ పన్నాగాన్ని అడ్డుకోవాలి
- ‘సర్’పై ప్రత్యేక దృష్టి సారించాలి
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు
- హైదరాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశం
హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నేతలు, ప్రజాప్రతిని ధులు దొంగ ఓట్లకు తావులేకుండా చూడాలని, తద్వారా కాంగ్రెస్, బీజేపీ పన్నాగాలను అడ్డుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. డబుల్ ఓట్లను గుర్తిస్తే వెంటనే యాంత్రాంగం దృష్టికి వెళ్లి తీయించాలని సూచించారు. హైదరాబాద్ జిల్లా కు చెందిన పార్టీ ప్రజాప్రతినిధులతో మంగళవారం ఆయన ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్ని కల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఇంట్లోనే పదుల సంఖ్యలో ఓట్లు నమోదయ్యాయని, అలా నియోజకవర్గంలో అక్రమంగా వేల సంఖ్యలో ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పరాజయానికి కారణం దొంగ ఓట్లేనని పేర్కొన్నారు. జిల్లాలో అర్హుడైన ఏ ఒక్క వ్యక్తి కూడా తన ఓటు హక్కును కోల్పోకుండా చూడాలని సూచించారు. నూతన ఓట ర్ల నమోదు ప్రక్రియను విరివిగా ప్రోత్సహించాలని చెప్పారు. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సర్‌పైనా కేటీఆర్ సుదీర్ఘంగా చర్చించారు.
ప్రతి ఒక్కరూ సర్‌పై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. జిల్లా పరిధిలో పార్టీ తరఫున సర్ పర్యవేక్షణ బాధ ్యతలను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు కేటీఆర్ అప్పగించారు. అనంతరం తలసాని మాట్లాడుతూ.. ప్రతి ఎమ్మె ల్యే, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి సర్‌ను ప్రాధాన్యత అంశంగా గుర్తించాలని సూచించారు.
బూత్ స్థాయిలో చురుకైన కార్యకర్త లను బూత్ లెవల్ అసిస్టెంట్స్ (బీఎల్‌ఏ)గా గుర్తించి, ఆ జాబితాను ప్రభుత్వ సిబ్బందికి, కేంద్ర పార్టీ కార్యాలయానికి అందజేయాలని ఆదేశించారు. త్వరలోనే బూత్ లెవల్ ఏజెంట్లకు నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నా రు. సమావేశంలో మాజీ మంత్రి పద్మారా వు గౌడ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలే రు వెంకటేష్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, వాణిదేవి, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు.






