calender_icon.png 1 February, 2026 | 7:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచరామిలో పశువైద్య శిబిరానికి స్పందన

01-02-2026 05:56:09 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మంచరామి గ్రామం లో ఆదివారం నిర్వహించిన పశువైద్య శిబిరంకు మంచి స్పందన లభించింది. ఈ శిబిరాన్ని సర్పంచ్ ఉప్పు లక్ష్మి ప్రారంభించారు. పశువైద్యాధికారులు హైదరాబాద్ నుంచి శిక్షణ పొందుతున్న పశువైద్య అధికారులు పాల్గొని సేవలందించారు.

శిబిరంలో పశువులకు అవసరమైన వివిధ రకాల టీకాలు వేయడంతో పాటు, గ్రామాలలో వైరస్ సోకిన కుక్కలకు గోలీలు వేసి చికిత్స అందించడం జరిగింది. దీని ద్వారా పశువులు, కుక్కలు ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్  ఉప్పు లక్ష్మీ తిరుపతి, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.