01-02-2026 05:52:27 PM
* స్వామివారిని స్మరిస్తూ అలరించిన భక్తి పాటలు
* కనులారా తిలకించిన భక్తిజనులు
గరిడేపల్లి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంలో కొలువై ఉన్న చారిత్రాత్మక శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి వార్షిక కళ్యాణం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభించి తోరణ అలంకరణ శ్రీ ఆంజనేయ స్వామి వారికి అభిషేకం నవగ్రహ హోమం సుదర్శన హోమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం వేద పండితులు అలహరి నరసింహచార్యులు రవి అయ్య ఆధ్వర్యంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణం వేదమంత్రాల నడుమ కన్నుల పండుగలా నిర్వహించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు స్వామి వారి కళ్యాణాన్ని కనులారా తిలకించారు. స్వామివారిని స్మరిస్తూ పాడిన భజన పాటలు భక్త లోకాన్ని తరింపజేశాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ మేనేజర్ కొంకపాక మృత్యుం జయ శాస్త్రి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.
స్వామి వారి కళ్యాణం అనంతరం అన్నప్రసాద పంపిణీ నిర్వహించారు. ఈ కళ్యాణ ఉత్సవంలో పొనుగోడు గ్రామ సర్పంచ్ కటకం వేణు, ఉప సర్పంచ్ జోగు అరవింద రెడ్డి, కటకం రమేష్, అలుగుబెల్లి రవీందర్ రెడ్డి, ఎల్లావుల పిచ్చయ్య కంది బండ చిన్నరామయ్య రామదాసు, శ్రీ వాణి స్కూల్ కొణతం సీతారాం రెడ్డి, కందిబండ నాగేశ్వరరావు, అలుగుబెల్లి దేవి రెడ్డి, బాల్తు సుధాకర్, జోగు లింగారెడ్డి, చందా మోహన్ రెడ్డి, నక్కమట్టయ్య, అనంతు వెంకన్న గౌడ్, రామకోటమ్మ, శ్రీదేవి, మాధవి తదితరులు పాల్గొన్నారు