14 April, 2026 | 5:10 PM

Breaking News

ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •   చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కుంజా వినోద్   •  

చెరువుల పునరుద్ధరణ ముఖ్యం

13-11-2025 12:00 AM

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్  

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 12(విజయక్రాంతి): చెరువుల అభివృద్ధి అంటే కేవలం వాటికి రంగులు వేసి, బండ్ల ను అందంగా అలంకరించడం మాత్రమే కాదని, వాటి అసలు ఉద్దేశం నెరవేరేలా పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. సకల జీవరాశులకు ప్రాణాధారంగా, నగరానికి వరద ముప్పును నివారించే సహజ వ్యవస్థలుగా చెరువులను తీర్చిదిద్దినప్పుడే అది నిజమైన అభివృద్ధి అవుతుందని ఆయన అన్నారు.

తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం బుధవారం శిల్పకళావేదికలో నిర్వహించిన‘సౌత్ ఇండియా సీఎస్‌ఆర్ సమ్మిట్’ లో హైడ్రా కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ సీఎస్‌ఆర్ నిధుల కింద చెరువులను అభివృద్ధి చేస్తున్న సంస్థలకు కీలక సూచనలు చేశారు. చెరువుల్లో పేరుకుపోయిన పూడికను, ఆక్రమణలను, చుట్టూ పోసిన మట్టిని పూర్తిగా తొలగించి, వాటి సహజ విస్తీర్ణాన్ని, లోతును పునరుద్ధరించాలన్నారు.

మురుగునీరు చేరకుండా పటిష్టమైన చర్యలు తీసు కున్నాకే, సుందరీకరణ, ఇతర ఆకర్షణలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. సీఎస్‌ఆర్ నిధులు పూర్తిస్థాయిలో సద్వినియోగ మయ్యేలా ఆయా సంస్థలు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. గొలుసుకట్టు చెరువుల కు ప్రాణాధారమైన నాలాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.