calender_icon.png 12 November, 2025 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుందరయ్య పార్క్ ఆహ్లాదకర వాతావరణాన్ని దెబ్బతీస్తున్న వాకర్స్ క్లబ్..

12-11-2025 11:05:38 PM

జోక్యం చేసుకోవాలని జిహెచ్ యంసి జోనల్ కమీషనర్ కు వాకర్స్ సభ్యుల ఫిర్యాదు..

ముషీరాబాద్ (విజయక్రాంతి): బాగ్ లింగంపల్లి సుందరయ్య పార్క్ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వాకర్స్ క్లబ్ అఫ్ హైదరాబాద్ సెంట్రల్ పేరుతో ఉన్న సంస్థ దెబ్బతీస్తోందని, వెంటనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జోక్యం చేసుకుని పార్కుకు వచ్చే వాకర్స్ కు మంచి వాతావరణాన్ని కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సుందరయ్య పార్క్ వాకర్స్ కోరారు. ఈ మేరకు బుధవారం వాకర్స్ సభ్యులు వెంకటకృష్ణ (బబ్లు), రాజేంద్రప్రసాద్ గౌడ్, కాసాని ఆనంద్, మన్నె దామోదర్ రెడ్డి, కిషన్ రావు, వెంకటస్వామి గౌడ్, రాయపాటి రవి బుధవారం జిహెచ్‌ఎంసి జోనల్ కమిషనర్ డాక్టర్ రవికిరణ్ ను కలిసి సుందరయ్య పార్కులో క్లబ్ కార్యకలాపాలను అరికట్టి మంచి వాతావరణాన్ని కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం సుందరయ్య పార్క్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

పార్కులో కొంత మంది వాకర్స్ క్లబ్ పేరుతో రాజకీయాలు చేస్తూ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారని, దీంట్లో గ్రూపు రాజకీయాలు, ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతూ పార్క్ కు వచ్చే వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఫలితంగా నిత్యం పార్క్ కు వచ్చే వారని, ఇక్కడి రాజకీయాలను చూసి రావడానికి ఇష్టపడడం లేదన్నారు. పార్కులో ఏ మాత్రం సంబంధం లేని కార్యక్రమాలను వాకర్స్ క్లబ్ వారు ఇక్కడి నుండే కొనసాగిస్తున్నారని, క్లబ్ సమావేశాలను సుందరయ్య పార్కులో నిర్వహించడంతో పార్కు సుందరీకరణ దెబ్బతింటోందని పరిసర ప్రాంతాలు పాడవుతున్నాయన్నారు. జిహెచ్‌ఎంసి అధికారులు స్పందించి పార్కులో మంచి వాతావరణం కలుగజేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని, క్లబ్ కు సంబంధించిన పార్కులో ఉన్న గదిని కూడా స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రఫీ అహ్మద్, ఆర్. జయదేవ్, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.