23 July, 2026 | 10:20 AM

నీట్ పేపర్ లీక్ పై ప్రధాని మోదీ సంచలన ప్రకటన

23-07-2026 09:50 AM
  1. నీట్ పేపర్ లీక్ దోషులను వదిలే ప్రసక్తే లేదు
  2. నీట్ పేపర్ లీక్ పై ప్రధాని మోదీ ట్వీట్
  3. యువత భవిష్యత్తు కంటే ఏదీ ముఖ్యం కాదు
  4. యువత భవిష్యత్తును దెబ్బతీస్తే ఉపేక్షించబోం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) స్పందించారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని ప్రధాని వెల్లడించారు. నీట్ పేపర్ లీక్ మాఫియాను వదిలే ప్రసక్తే లేదని నరేంద్ర మోడీ తేల్చిచెప్పారు. పేపర్ లీక్ ఘటనలో నిందితులకు కఠినశిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు.

నీట్ పేపర్ లీక్(NEET paper leak) దోషులను వదలబోమని హెచ్చరించారు. యువతకు హానీ చేస్తున్న వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. యువత భవిష్యత్తుకే తమ తొలి ప్రాధాన్యమన్న ఆయన యువత సంక్షేమం, భవిష్యత్తు కంటే ఏదీ ముఖ్యం కాదన్నారు. యువత భవిష్యత్తు విషయంలో రాజీపడేది లేదని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని ప్రధాని ప్రకటించారు. అటు నీట్ పేపర్ లీక్(NEET Exam leak) పై దేశవ్యాప్తంగా కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి.