calender_icon.png 9 November, 2025 | 6:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి కొనుగోళ్లలో ఆంక్షలను తొలగించాలి

09-11-2025 04:37:34 PM

రైతు సంఘం మహిళా రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల..

నకిరేకల్ (విజయక్రాంతి): కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సీసీఐ పత్తి కొనుగోళ్లలో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఆంక్షలను వెంటనే తొలగించి పత్తి కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఏఐకేఎస్ తెలంగాణ రైతు సంఘం మహిళా రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. ఆదివారం కట్టంగూరు మండల‌ కేంద్రంలో అమరవీరుల స్మారక భవనంలో రైతు సంఘం నాలుగో మండల మహాసభను నిర్వహించారు. ఈ మహా సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని మోడీ అనంతరం ప్రభుత్వం సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ప్రారంభించడం మాత్రమే కాకుండా, రైతులను ఇబ్బందులు పెట్టేందుకు అనేక నిబంధనలు పెట్టిందన్నారు.

రైతులు ఎండనక వాననక పత్తి పంట పండించడానికి తీవ్రకష్టాలు పడుతున్నా కొనుగోళ్లలో సాంకేతిక ఆంక్షలతో నెట్టేస్తున్నారని తెలిపారు. కపాస్కిసాన్ యాప్ ద్వారా ముందుగా స్లాట్ బుకింగ్ తప్పనిసరి చేయడం, తేమ శాతం 10 లోపే ఉండాలని నిబంధన పెట్టడం, ప్రతి ఎకరాకు కేవలం 7 క్వింటాళ్ల వరకే కొనుగోలు పరిమితి విధించడం వల్ల పత్తి రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు.మన గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా చాలామంది రైతుల వద్ద టచ్్ఫన్లు లేవన్నారు. ఉన్నవారికి కూడా సిగ్నల్, ఓటీపీ సమస్యలతో యాప్ ద్వారా స్లాట్బుక్ చేసుకోవడం కష్టమవుతుందన్నారు. ఈ యాప్ గురించి ప్రభుత్వం అవగాహనా కార్యక్రమాలు నిర్వహించలేదని మండిపడ్డారు. ఇటీవలి ఆకాల వర్షాలు, తుఫాను వాతావరణపరిస్థితుల వల్ల పత్తి తడిసి తేమశాతం 10 లోపు రాకపోవడంతో సీసీఐ కేంద్రాలు పత్తిని తిరస్కరిస్తున్నాయని తెలిపారు.

గత్యంతరం లేక రైతులు తమ పత్తిని తిరిగి ఇంటికి తీసుకుపోతున్నారని,ఇది రైతులకు నష్టం కలిగిస్తోందని పేర్కొన్నారు. గతంలో ఎకరాకు 12 క్వింటాళ్ల వరకు పత్తిని కొనుగోలు చేసేవారని, ఇప్పుడు దాన్ని 7 క్వింటాళ్లకు తగ్గించడం రైతులకు పెద్దదెబ్బగా మారిందని తెలిపారు. ఇదే సమయంలో విదేశాల నుండి పత్తిని దిగుమతి చేసుకుంటూ, సుంకాలను తగ్గించి విదేశీ రైతులకు లాభాలు చేకూరుస్తూ దేశీయ రైతులను నష్టపరుస్తున్న మోడీ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పుబట్టారు. స్లాట్ బుకింగ్ పద్ధతి,కపాస్ కిసాన్ యాప్ను రద్దు చేసి, ఎకరాకు 12 క్వింటాళ్ల వరకు పత్తి కొనుగోలు చేయాలని, తేమ శాతం పరిమితిని 20 శాతానికి పెంచాలని, రైతులను ఇబ్బంది పెట్టే ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలన్నారు.

లేనిపక్షంలో సంఘం ఆధ్వర్యంలో రైతులతో కలిసి బహిరంగ పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.  అనంతరం నూతన కమిటీ ఎన్నుకున్నారు.గౌరవాధ్యక్షులుగా ఎన్న నర్సిరెడ్డి  అధ్యక్షులు మురారి మోహన్ ఉపాధ్యక్షులు నంద్యాల అనంత రెడ్డి ఉపాధ్యక్షులు  గద్దపాటిఎల్లయ్య ప్రధాన కార్యదర్శి  పెంజర్ల కృష్ణ సహాయ కార్యదర్శి మారబోయిన లక్ష్మీనారాయణ సహాయ కార్యదర్శి ఊటుకూరి సుజాత సభ్యులు మారెడ్డి రఘురాం రెడ్డి వంగూరు ఎల్లయ్య కంచర్ల సాగర్ రెడ్డి గండమల్ల బిక్షం, కొరివి దుర్గయ్య, తుల బిక్షమయ్య, చింతల చలపతి రెడ్డి, వనం సుందర్. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పెంజర్ల సైదులు, రైతు సంఘం నాయకులు జాల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.