calender_icon.png 16 September, 2025 | 12:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా ఆసుపత్రిలో మీడియాపై ఆంక్షలు తొలగించాలి

16-09-2025 12:45:52 AM

ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి వారణాసి శ్రీనివాస్

కుమ్రం భీం అసిఫాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): జిల్లా ఆస్పత్రిలో మీడియాపై ఆంక్షలు తొలగించాలని ఆసిఫాబాద్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి వారణాసి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వైద్యులు సరిగ్గా విధులు నిర్వహించడం లేదని విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులను అనుమతించకపోవడం, సూచిక బోర్డులపై అనుమతి లేదని నోటీసులు అంటించడంపై ప్రెస్ క్లబ్ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రేకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

జిల్లా ఆసుపత్రి పూర్తిగా రిఫరల్ ఆసుపత్రిగా తయారైందని అన్నారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించాల్సిన వైద్యులు సరిగ్గా విధులు నిర్వహించడం లేదన్నారు. బాధితుల ద్వారా విషయం తెలుసుకున్న జర్నలిస్టులు అక్కడికి వెళ్ళగా వారిని ఫోటోలు తీయకుండా నివారించడంతోపాటు, నిషేధం నోటీసు అంటించడం దారుణమని, మీడియాపై పెట్టిన ఆంక్షలు తొలగించి బాధితుల సమస్యలు వెలికి తీసేలా తమకు స్వేచ్ఛ ఇవ్వాలన్నారు. జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి మీడియా ప్రతినిధులను ఇబ్బంది పెట్టకుండా చూస్తానని హామీ ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సురేష్, శ్రీనివాస్, కోశాధికారి శ్రీధర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజ్ కుమార్, అసిస్టెంట్ సెక్రటరీ రవి, సలహాదారుడు శంకర్, ఉపాధ్యక్షుడు సతీష్, అక్రిడేషన్ కమిటీ మెంబర్ ప్రకాష్, సభ్యులు రమేష్, తారు, సోలంకి రమేష్, పాల్గొన్నారు.