16-09-2025 12:46:05 AM
విడుదల చేస్తూ ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలోని మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు బయ్యారం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.3.34 కోట్లు కేటాయిస్తూ పరిపాలన అనుమతులిచ్చింది. ఈ మేరకు సోమవారం నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం జిల్లాలోని మధిర మండలంలో ఉన్న వైరా నది కుడి ఒడ్డున ఉన్న బయ్యారం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం అంచనా వ్యయాన్ని పునరుద్ధరిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఎస్‌ఎల్‌ఎస్సీ ఏర్పాటు
ఉపరితల మైనర్ ఇరిగేషన్ పథకం అమలు కోసం ‘స్టేట్ లెవల్ సాంక్షనింగ్ కమిటీ(ఎస్‌ఎల్‌ఎస్సీ)ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. ఈఎన్సీ జనరల్ కమిటీ చైర్మన్‌గా, చీఫ్ ఇంజినీర్ కన్వీనర్‌గా, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, సీడబ్ల్యూసీ డైరెక్టర్, అగ్రి డైరెక్టర్, ప్రాజెక్టు సీఈలు కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.