16-09-2025 12:45:23 AM
హుజూరాబాద్, సెప్టెంబర్15:(విజయ క్రాంతి) కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణానికి చెందిన బీజేపీ 28వ బూత్ అధ్యక్షు రాలు, సీనియర్ నాయకురాలు కెక్కర్ల రేణుక అనారోగ్యంతో సోమవారం ఉదయం మృతి చెందారు. మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఆమె మృతికి సంతాపం తెలిపి, భౌతిక కాయానికి ఘనంగా నివాళులర్పించి అంతిమయాతిలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేణుక మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. పార్టీ ఎదుగుదలకు ఆమె నిరంతరం కష్టపడి పనిచేసేవారని అన్నారు. సంతాపం తెలిపిన వారిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, హుజూరాబాద్ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు, నాయకులు నల్ల సుమన్, ప్రభాకర్, వేణు, రాజశేఖర్, వాసు, రాజు, చంద్రిక, వెంకటేష్, సంతోష్, కార్యకర్తలు, వివిధ పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులుపాల్గొన్నారు.