సైబర్ ఉచ్చులో రిటైర్డ్ జడ్జి
డిజిటల్ అరెస్టు పేరుతో 1.66 కోట్ల మోసం
మేడ్చల్, మార్చు 9 (విజయక్రాంతి)/ఎల్బీనగర్: నేరేడ్మెట్‌కు చెందిన 73 ఏళ్ల రిటైర్డ్ జడ్జికి ఫిబ్రవరి 23న గుర్తు తెలియని వ్యక్తి నుంచి వీడియో కాల్ వచ్చింది. తాను సీబీఐ అధికారి దీపక్ కుమార్ అని పరిచయం చేసుకొని ఆధార్‌తో అనుసంధానమైన ౨ ఫోన్లలో మహిళలకు అసభ్యకరంగా కాల్స్ చేస్తున్నారని, కర్నాటక రాష్ట్రం బెంగళూరు సిటీలోని ఇందిరానగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయిందని చెప్పాడు. మరొకరు కాన్ఫరెన్స్‌లోకి వచ్చి తాను సీఐ గౌరవ సారథినని పరిచయం చేసుకున్నాడు.
మాన వ అక్రమ రవాణా చేస్తున్నారని సుప్రీంకోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందని భయపెట్టాడు. బ్యాంకు ఖాతా వివరాలు ఇ వ్వాలని, విచారణ తర్వాత డబ్బులు తిరిగి ఇస్తామన్నారు. ఎవరికీ చెప్పొద్దని భయపెట్టారు. పరువు పోతుందనుకున్న బాధితుడు రూ.1.66 కోట్లు మోసగాళ్లు చెప్పిన ఖాతాల కు పంపాడు. తర్వాత నిందితుల ఫోను పనిచేయకపోవడంతో మోసపోయానని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.




