calender_icon.png 5 August, 2025 | 2:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదవి విరమణ అధికారులకు సన్మానం

30-11-2024 08:14:41 PM

మందమర్రి (విజయక్రాంతి): ఏరియాలోని సింగరేణి జిఎం కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ సూపరిండెంట్ సాంబ శివరెడ్డి, ఆఫీస్ సూపరెండెంట్ దామోదర్ లు ఈ నెలలో పదవీ విరమణ పొందుతున్న అధికారులను ఏరియా జిఎం. జి.దేవేందర్ ఘనంగా సన్మానించారు. శనివారం పట్టణంలోని ఎల్లందు క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిఎం ఇతర అధికారులు ఘనంగా సన్మానించారు. అనంతరం జిఎం మాట్లాడుతూ.. ప్రతి ఒక్క అధికారికి పదవి విరమణ తప్పనిసరి అని, పదవి విరమణ అధికారుల బావి జీవితం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో సాగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్బంగా పదవి విరమణ పొందుతున్న అధికారుల సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిజిఎం ఈఅండ్ఎ వెంకటరమణ, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, జిఎం కార్యాలయ సీనియర్ అధికారులు, హెచ్ఓడి లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.