calender_icon.png 5 August, 2025 | 12:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల భోజనంపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు

30-11-2024 07:57:10 PM

భైంసా (విజయక్రాంతి): సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలో విద్యార్థులకు అందిచే భోజనం మెను ప్రకారం నాణ్యతగా ఉండేలా చూడాలని డీపీవో శ్రీనివాస్ అన్నారు. కుంటాలలో శనివారం సంక్షేమ వసతి గృహాల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రధానోపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం, వసతిగృహాల్లో విద్యార్థులకు ఎప్పటికప్పుడు తాజాగా వండి వడ్డించాలన్నారు. ఆహర భద్రత కమిటీలను నియమించాలన్నారు. పరిశ్రుభత పాటించాలని, పూర్యిఫైయిడ్ నీరు అందించాలన్నారు. భోజనం వండిన తరువాత సంబంధిత అధికారులు, ప్రధానోపాధ్యాయులు మొదటగా తిన్న తరువాతనే విద్యార్థులకు వడ్డించాలన్నారు. ఏ లోపం జరిగినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎజాజ్‌ అహ్మద్, ఎంపీడీవో లింబాద్రి, ఎంఈవో ముత్యం, ఎంపీఈవో రహీం పాల్గొన్నారు.