ప్రతీ ఉద్యోగికి విరమణ తప్పదు
డి.ఆర్.డి.ఓ. ఎ.పి.డి. విజయ లక్ష్మీ
గాంధారి, మార్చి 2 (విజయ క్రాంతి) : ప్రతీ ఉద్యోగి జీవితంలో విరమణ తప్పదు అని డి.ఆర్.డి.ఓ. ఎ.పి.డి విజయ లక్ష్మీ అన్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని ఐకెపి కార్యాలయంలో పేట్ సంగెం క్లస్టర్ సీసీ ఉప్పల రాజేశ్వర్ పదవి విరమణ కార్యక్రమానికి సోమవారం నాడు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యోగం చేసిన కాలంలో ప్రజలకు ఎంత సేవ చేశామన్నదే ముఖ్యమని అన్నారు.
ఇప్పటివరకు ఉప్పల రాజేశ్వర్ మహిళా సంఘాల సభ్యులకు అందుబాటులో ఉంటూ తన ఉద్యోగ ధర్మాన్ని అద్వితీయంగా నిర్వర్తించారని ఆమె అభినందించారు. అనంతరం పదవి విరమణ చేస్తున్న ఐకెపి సీసీ ఉప్పల రాజేశ్వర్ దంపతులను ఆమె శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు ఐకెపి ఉద్యోగ సంఘాల నేతలు ఉప్పల రాజేశ్వర్ ను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమం లో డీపీఎంలు నూకల శ్రీనివాస్, సురేష్, ఏపీఎం యూనియన్ జిల్లా అధ్యక్షుడు బాణాల రాజిరెడ్డి, గాంధారి ఏపీఎం ప్రసన్న కుమార్, బీబీపేట ఏపీఎం శ్రీనివాస్, శ్రీనిధి ఆర్.యం. కిరణ్, వి.ఓ.ఎ. ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గౌస్ ఖాన్, విక్రమ్, సీసీ లు రాజి రెడ్డి, రాములు, కాశినాథ్, రమేష్, శేకర్, లక్ష్మీ దేవి, కవిత, భార్గవి, స్వప్న పాల్గొన్నారు.




