23 June, 2026 | 8:25 PM

Breaking News

బోధన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్   •   ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి   •   పాఠ్యపుస్తకాల పేరిట దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ హెచ్చరిక   •   నెల రోజులు ఇంటింటి సర్వే...   •   రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వెంటనే జమ చేయాలి   •   కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం   •   ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •   విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •  

ప్రమోషన్లు లేకుండానే రిటైర్‌మెంట్స్

09-07-2024 12:00 AM

పంచాయతీరాజ్ శాఖ విభాగంలో పని చేసే రికార్డ్ అసిస్టెంట్‌ల పరిస్థితి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్టుగా ఉంది. వీరు ఉద్యోగాలలో చేరి ఏండ్లు గడుస్తున్నా ఎలాంటి ప్రమోషన్లకు నోచుకోవడం లేదు. ఇతర శాఖలలో రికార్డు అసిస్టెంట్ పోస్టుల వారు మాత్రం చక్కగా పదోన్నతులు పొందున్నారు. కానీ, పంచాయతీరాజ్ శాఖ వారికి అవి అందని ద్రాక్షలే అవుతున్నాయి. చాలామంది రిటైర్ అయ్యేనాటికి కూడా ఎలాంటి పదోన్నతి పొందలేక పోతుండడం దురదృష్టకరం.

 షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్