23 June, 2026 | 7:18 PM

Breaking News

విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •   ప్రజారోగ్యాన్ని... నాశనం చేస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే మూయించండి   •   వెంకటాపురం గ్రామంలో విద్యా సామగ్రి పంపిణీ   •   చికిత్స కోసం రూ.1.50 లక్షల ఎల్ఓసి అందజేత   •   పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ చైర్మన్‌గా మిద్దెల సత్యనారాయణ   •   విద్యార్థులకు స్ఫూర్తి… నోటుబుక్స్ పంపిణీతో ఆనందం   •   ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య... నాణ్యమైన భోజనం   •  

బేగంపేట నుంచి ‘ఉడాన్’ సేవలు

09-07-2024 12:00 AM

హైదరాబాద్‌కు చేరువలో శంషాబాద్‌లో ‘అంతర్జాతీయ విమానాశ్రయం’ నిర్మించిన తరువాత బేగంపేట విమానాశ్రయం దాదాపు నిరుపయోగంగా మారింది. కేవలం ప్రత్యేక విమానాలు దిగటానికి, ప్రధాని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి వంటి పెద్దలు వచ్చినప్పుడు మాత్రమే ఉపయోగపడుతున్నది. నగరం మధ్యలో ఉన్న బేగంపేట విమానాశ్రయం నుంచి చిన్న నగరాలకు ఉద్దేశించిన ‘ఉడాన్’ పథకం (యుడిఏఎన్ ప్రాంతీయ విమాన కనెక్టివిటీ ప్రాజెక్ట్) కింద వైమానిక సేవలు అందిస్తే బావుంటుంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌లలోని చిన్న నగరాలకు విమాన ప్రయాణ సౌకర్యం మెరుగవుతుంది. ‘ఉడాన్’ సేవలను మరింత మెరుగు పరచవచ్చు. కేంద్ర విమానయాన శాఖ ఈ దిశగా దృష్టి సారించాల్సిందిగా విజ్ఞప్తి. 

 కప్పగంతు వెంకట రమణమూర్తి, సికింద్రాబాద్