calender_icon.png 18 July, 2025 | 12:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్రాడ్ కంపెనీలతో రేవంత్ ఒప్పందాలు

07-08-2024 01:56:16 AM

బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్

హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): కేసీఆర్ హయాంలో తీసుకున్న నిర్ణయాలతో తెలంగాణకు పెట్టుబడులు పెరిగాయని, ఐటీ సంస్థలు పెద్ద సంఖ్యలో వచ్చాయని బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిషాంక్ స్పష్టంచేశారు. 2023 నుంచి ౨౦24 వరకు పెట్టుబడులు సగానికి పడిపోయాయని ఆరోపించారు.

రేవంత్ ముఖ్యమంత్రి కాగానే దావోస్ వెళ్లి గోదీ ఇండియా అనే బొగస్ సంస్థ తో ఒప్పందం కుదర్చుకున్నారని  ఆరోపించారు. మూసీప్రాజెక్టుపై లక్షన్నర కోట్లకు అంచనాలు పెంచారని, దాన్ని అప్పగించే సంస్థకు లుక్ అవు ట్ నోటీసు వచ్చిందని చెప్పారు.

తెలంగాణ మహిళలకు ఉపయోగపడే రూ.839 కోట్ల పెట్టుబడి వచ్చిందని, కర్రా హోల్డింగ్స్ కంపెనీ ఒప్పందం చేసుకున్నట్టు సీఎం కార్యాలయం తెలిపిందని అన్నారు. వాల్ష్‌కర్రా ౪ నెలల కితం ప్రారంభమైందని, ఈ కంపెనీకి ఇద్దరు డైరెక్ట ర్లే ఉన్నారని వారికి 50 శాతం షేర్లు ఉన్నట్టు స్ట్రుక్ అయిన కంపెనీ తెలంగాణలో ఏవిధంగా పెట్టుబడి పెడుతుందని నిలదీశారు. ఫ్రాడ్ కంపెనీల నుంచి పెట్టుబడుల కోసం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లినట్టు ఉందన్నారు.