20 April, 2026 | 3:27 AM

రేవంత్ పోవాలే.. కేసీఆర్ రావాలే

20-04-2026 01:41 AM
  1. సీతారామ పూర్తి కావాలంటే.. కేసీఆర్ రావాలి

రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోంది

కాంగ్రెస్ పథకాలన్ని పెద్ద బోగస్

సీఎం, మంత్రులందరు కమీషన్ల కోసం పనిచేస్తుండ్రూ

రుణమాఫీ ఎక్కడ చేసిండ్రో నిరూపిస్తరా..? 

తుమ్మలకు సవాల్ ఖమ్మం లో పదికి పది గెలిచి చరిత్ర తిరగరాస్తాం

ఖమ్మం బహిరంగ సభలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు

ఖమ్మం, ఏప్రిల్ 19(విజయక్రాంతి):  తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసిన, ఎవరి నోట విన్న ఒకటే మాట.. రేవంత్ రెడ్డి పోవాలే.. కేసీఆర్ రావాలే.. ఇది తెలంగాణ ప్రజల అభిప్రాయమని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు. నాయకులు, కార్యకర్తలు ఎవరు ఆదైర్య పడోద్దని, కచ్చితంగా రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఖమ్మం నగరంలోని మమత ఆసుపత్రి ప్రాంగణంలో బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది.. వేలాధి మంది కార్యకర్తలు తరలివచ్చారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తన్నీరు హారీష్ రావుకు ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమానికి హారీష్ రావు హాజరై కేక్ తినిపించి పువ్వాడకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హారీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పాలన రాజ్యమేలుతుందన్నారు.

సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులందరు కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారని, వాళ్లువాళ్లు కొట్టుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మైనింగ్ మాఫీయా, ఇసుక మాఫీయా, భూ మాఫీయా ఎక్కువైందన్నారు.  అసెంబ్లీలో ఇవ్వన్ని అడిగినందుకు మమ్మల్ని మెడలుపట్టి బయటకు పంపిస్తున్నారని ఆరోపిం చారు. అసెంబ్లీలో మమ్మల్ని బయటకు పం పించారేమో కానీ, ప్రజల గుండెల్లో నుంచి బయటకు పంపించలేరని గుర్తు చేశారు. 

ప్రభుత్వ పతకాలు పెద్ద బోగస్

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే ప్రభుత్వ పథకాలు అన్ని పెద్ద బోగస్ అని మాజీ మంత్రి హారీష్ విమ్మర్శాంచారు. రైతు రుణమాఫీ బోగస్, రైతు భరోసా బోగస్, కార్పోరేషన్లకు నిధులు కేటాయించుడు పెద్ద బోగస్, బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేసుడు బోగస్, అడుగడుగున అన్ని బోగస్ మాటలేనని హారీష్ రావు ఆరోపించారు. సీఎం, మంత్రులు తెలంగాణ ప్రజలను నిలువునా మోసం చేస్తూ దోచుకోవడం, ఆ డబ్బులను ఢిల్లీ పోయి ప్యాకేజీలు ఇవ్వడం. ఇదే పాలన రాష్ట్రంలో కొనసాగుతుందన్నారు. ఈ పాలనకు ప్రజలు పుల్ స్టాఫ్ పెట్టేందుకు సిద్దంగా ఉన్నారని ఆరోపించారు. 

రైతుల ఉసురు పోసుకుంటున్న రేవంత్ సర్కార్

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతుల ఉసురుపోసుకుంటుందని మాజీ మంత్రి తన్నీరు విమ్మర్శించారు. రాష్ట్రంలో అత్యధికంగా మక్కలు పండాయని, వాటిని కొనే నాథుడే కరువైయ్యారని ఆరోపించారు. మక్కలు పండించిన రైతులు రోడ్డు ఎక్కి నిరసనలు, ఆందోళనలు చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. అలాగే ధాన్యం కొనుగోలు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, క్వింటాకు 5కేజీల తూకం తీసి రైతుల జేబులను ఖూనీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసి, ఇన్ టైమ్ లో డబ్బులు రైతులకు అందించిన ఏకైక ప్రభుత్వం బీఆర్‌ఎస్ ప్రభుత్వం అని కొనియాడారు. 

తుమ్మలకు సవాల్ విసిరిన హారీష్ 

రాష్ట్రంలో రైతులందరికి రుణమాఫీ చేశామని వ్యవసాయ మంత్రి చెబుతున్నాడని, తుమ్మలకు నేరుగా సవాల్ చేస్తున్నా.. ఎక్కడ రుణమాఫీ నూరు శాతం అమలు చేశారో చూపిస్తారా..? అని ప్రశ్నించారు. మీ స్వంత నియోజకవర్గం రఘునాథపాలెం రమ్మంటావా..? లేదంటే సిద్దిపేట వస్తావా..? ఎక్కడికి వచ్చి నూరు శాతం అమలైందని తుమ్మల నాగేశ్వరరావు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. రుణమాఫీ అమలు చేయలేదని, రైతు భరోసా ఇవ్వకుండా మెండికేస్తున్నారు.

ఖమ్మంలో పదికి పది గెలుస్తాం

ఖమ్మం జిల్లాలో రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా పదికి పది స్థానాలు గెలిచితీరుతామని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు జోస్యం చెప్పారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముగ్గురు మంత్రుల అవీనితి కారణంగా మంచి మెజారిటీతో రాబోయే ఎన్నికల్లో గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. 

పొంగులేటి మైనింగ్ మాఫీయాను బయటపెట్టాం

రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన మైనింగ్ మాఫీయాను అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టామని, దీంతో సీఎంతో సహా అందరు కంగుతిన్నారని హారీష్ రావు తెలిపారు. మైనింగ్ మాఫీయాను బయటపెట్టి చర్యలు తీసుకోవాలని అడిగితే అసెంబ్లీ నుంచి బయటకు పంపిస్తున్నారని ఆరోపించారు. అయినప్పటికి పొంగులేటిని వదిలేదని స్పష్టం చేశారు.

అలాగే ఒక మంత్రి భూ బకాసురుడు, మరో మంత్రి కమీషన్ల కింగ్, ఇంకో మంత్రి పర్శంటేజీల కింగ్ అని ఆరోపించారు. మన ప్రభుత్వం రాగానే ఈ కింగ్ ల సంగతి మన ప్రజల కింగ్ చూసుకుంటారని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు రవిచంద్ర, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు తాతామధు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు, కమలరాజు, బొమ్మర రామూర్తి, పగడాల నాగరాజు తదితరులు హాజరైయ్యారు.