17 April, 2026 | 3:10 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

రేవంత్‌రెడ్డి కృషి విజయవంతం కావాలి

06-12-2025 12:19 AM
  1. రాష్ట్రాభివృద్ధికి సీఎం కష్టపడుతున్నారు
  2. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియాగాంధీ  
  3. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటుపై సీఎంకు లేఖ    

హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కీలక భూమికి పోషిస్తుందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియాగాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడంపై సోనియాగాంధీ హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అభినందనలు తెలిపారు.

రాష్ట్ర అభివృద్ది కోసం సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న కృషి విజయవంతం కావాలని సోనియాగాంధీ ఆకాంక్షించారు. తెలంగాణ అభివృద్ధ్దికి సబంధించిన ప లు కీలక , ప్రాముఖ్యమైన ప్రాజెక్టులు, ప్రణాళికల్లో భాగస్వాములు కాదల్చిన వారికి, ఈ సమ్మిట్ ఒక వేదికగా అందిస్తుందని ఆమె తెలిపారు.

అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ వ్యవసాయాభివృద్ది ప్రాజెక్టుకు సమ ప్రాధాన్యత ఇస్తూ మూడెంచల వ్యూహంతో తెలంగాణ ముందుకు సాగుతోందని సోనియాగాంధీ రాసిన లేఖలో ప్రస్తావించారు. తెలంగాణలోని మానవ వనరులు, సహజన వనరులు, ప్రజల వ్యాపారా నైపుణ్యం, అంతర్జాతీయ ప్రతిభ, సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధ్దికి సమ్మిట్ మరింత తోడ్పడుతుందన్నాఉరు, సమ్మి ట్‌లో పాల్గొనే వారందరికి సోనియాగాంధీ శుభాకాంక్షలు తెలిపారు.